Tuesday, November 17, 2009

తీయనైన తెలుగు పాట నేర్చుకుందాం!!!!

ఈ మధ్య మన తెలుగు భాష  పై  జరిగిన  రభసని గమనించాం కదా ! ఆ నేపథ్యంలో మనమంతా తెలుగులో గేయాలని ఆలపించాలని నిర్ణయించారు కదా !మరి ఈ రోజు నాకు  2 గేయాలు పరిచయం చేయాలనీ ఉంది! తెలిస్తే పాడేసుకోండి తెలియకపోతే నేర్చుకోండి !ఇవి నేను సేకరించినవి మాత్రమే సుమా!

1) జోహారులే తల్లి జోహారులే నీకు
    మము గన్న మా తల్లి మా తెలుగు తల్లివే  ||2||
    రాయలేలిన నాడు రతనాల తూగేవు!!
    రాజరాజులు నాడు రాజ్యాలనేలేవు ||జోహారులే||
    గంటమొక చేతిలో ఖడ్గమొక  చేతిలో 
    విలసిల్లు మా తల్లి వీర మాతవే తల్లి  ||జోహారులే||
    దశ దిశల నీ యశము దీప్తించనే తల్లి
    మా పూజలందుకో మా భాగ్య దేవత ||జోహారులే||
 
మరొక చిన్ని గేయం మీ కోసం
2) తెలుగు బాలలం మేము వెలుగు బాలలం
    తెలుగు వెలుగు దశ దిశల నింపి వేసెదం
    పూల బాలలం మేము పాల బాలలం
    సుకుమారం మాధుర్యం చిందు బాలలం
    తెలుగు బాలలం మేము వెలుగు బాలలం
    తెలుగు వెలుగు దశ దిశల నింపి వేసెదం
    ఆటలాడెదం మేము పాట పాడెదం
    ఆటలలో పాటలలొ పోటీ పడెదము
    తెలుగు బాలలం మేము వెలుగు బాలలం
    తెలుగు వెలుగు దశ దిశల నింపి వేసెదం

మరి ముగించే ముందర ఒక చిన్ని ఝలక్

గాలి  పిల్ల ఎచటికి ?
పూల వాసనొద్దకు !
పూల వాసనెందుకు?
బాలలకిడునందుకు!
                                   బాలబంధు:బి.వి.నరసింహా రావు.

No comments:

Post a Comment