Wednesday, November 18, 2009

oka teeyani vanTakam

నా పోస్ట్ కి మొదటి విమర్శకుడు నా పుత్ర రత్నమే.....నా రచనలకి గుబాళింపు లేదట!
ఇవాళ ఒక తీయని వంటకంతో వాడికి జవాబు ఇవ్వదల్చుకున్నా!మా చిన్ను,సాయి,సుథా ఒన్స్ మోర్ ఒన్స్ మోర్ అనేవాళ్ళు! ఇప్పుడు చిన్ను ఇక్కడ లేకపోయినా, యు.ఎస్ లో ఉన్నా ఇప్పుడు దీని గురించి గుర్తు చేస్తే "ఆహా ఏమి రుచి" అంటుంది!!!
మరి మీకూ తెల్సుకోవాలని ఉందా ఆ మధుర రహస్యమేంటో???????!!!!!!!!!
ఇది నా విజయవంతమైన ప్రయోగం తెల్సా!


కావలసిన పదార్థాలు:
చిక్కటిపాలు(తాజావి)-2 లీ
పంచదార-రుచికి తగినంత(8 టే స్పూ)
బాదాం,జీడిపప్పు,పిస్తా విడివిడిగా -గుప్పెడు
యాలుకలు-2
పచ్చకర్పూరం-చాలకొద్దిగా



తయారీవిధానం:
పిస్తా,బాదాం పప్పులు గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టి పొట్టు తీయాలి.సగం పప్పులను సన్నగా కట్ చేసుకోవాలి.జీడిపప్పును కూడా సగం ముక్కలు చేసుకోవాలి.మిగిలిన సగం పప్పులని పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి.
ఒక మందపాటి గిన్నెలో పాలని పోసి సగం అయ్యేవరకు అడుగంటకుండా కలుపుతూ సన్నటి సెగన కాచాలి.ఆ తరువాత పేస్ట్ చేసి ఉంచుకున్న పప్పులని పాలల్లో కలపాలి,దీనికి పంచదార కూడా కలపాలి.తరువాత 10-15 నిమిషాలు జాగ్రత్తగా మరగనివ్వాలి .చివరిలో మిగిలిన పప్పులని కూడా జత చేసి పూర్తిగా చల్లారనిచ్చి ఫ్రిడ్జ్ లో ఉంచి సర్వ్ చేసుకోవాలి.
ఇది 6-8 మందికి సరిపోతుంది.
ప్రయత్నించండి,తక్కువ శ్రమతో ఎక్కువ మార్కులు కొట్టేసే వంటకం సుమా!!!!

No comments:

Post a Comment