Saturday, December 5, 2009

variety curries using mirchi

చలికాలం కదండీ! ఏదన్నా వేడివేడిగా కారంకారంగా  తినాలని మనసు లాగేస్తోంది కదా !మరి మీ కోసం నోరూరించే 2  రకాల కూరలు పరిచయం చేస్తాను!ఇప్పుడు కారం లేని పచ్చిమిరపకాయల సీజను , ఎక్కడ చూసినా  లేత ఆకు పచ్చ రంగులో ఊరిస్తున్నాయి ! 
మరి ఇంటికి tecchesukuni  కొత్త వెరైటీ లు చేసేసుకుందామా!


కావలసిన పదార్ధాలు :
పచ్చిమిర్చి -పావుకిలో(కారం తక్కువ ఉండేవి)
ఉల్లిపాయ తరుగు -౩ కప్పులు
శనగపిండి-2  కప్పులు
ఉప్పు -తగినంత (కొంచెం తక్కువే పడుతుంది)
నూనె- 1 కప్పు
జీలకర్ర- 1  టీ  స్పూన్
కొత్తిమీర తరుగు - ఒక గుప్పెడు


తయారుచేసే  విధానం:
పచ్చిమిర్చి teesukuni(మరీ పొడవు ఉంటె 2 భాగాలు చెయ్యండి  ).మధ్యలో గాటు పెట్టి గింజలు వేరే తీయండి.శనగపిండి తీసుకుని అందులో ఈ గింజలు, ఉల్లితరుగు,జీలకర్ర,ఉప్పు,2 -3 స్పూన్ల  నూనె  ఉప్పు వేసి కలపండి.
 దానిని మిరపకాయలలో పట్టినంతవరకు పెట్టండి.స్టౌ మీద వెడల్పు గ ఉన్న బాణలి పెట్టి సగం కప్పు నూనె వేసి ముక్కల్ని బాణలిలో సమానంగా saddandi .చాల తక్కువ సగలో ఉంచి ఒక 2  నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి.తరువాత మూత తీసి చాల నెమ్మదిగా ముక్కలని కలుపుతూ కొద్దిసేపు వేయించండి.ఆ తరువాత మిగిలిన పిండిని ముక్కాలా పై వేసి అడుగంటకుండా 5 - 10  నిమిషాలు వేయించండి ,అవసరం అనిపిస్తే ఇంకొంచెం నూనె కలపండి.కూర వేగిన తరువాత ఒక బౌల్ లోకి తీసుకుని కొత్తిమీర తో గార్నిష్ చేయండి.

ఇప్పుడు ఒక వెరైటీ అయ్యింది కదా ఇంకా రెండోది చూద్దామా!!అమ్మా ఆస దోస అప్పడం వడ !  అది సస్పెన్స్  రేపు  చెప్తా!
మరి ఇక శలవు   !!!!!!


  

Friday, December 4, 2009

అసలేమిటో ఈవాళ ఎలాగైనా ఒక పాట మీ కోసం అందించాలని నా మనసు ఉవ్విళ్ళూరుతోంది .మరి చెప్పనా?

జయము జయము తల్లి ,జయము కల్పవల్లి
పరిమళాల బ్రతుకుపూలు పచరింతుము నీదు పూజ
గంగాది నదీజలాల పొంగారెడు జీవనమ్ము
రంగారెడు నందనమ్ముబంగారము పండు ఫలము "జ"
వేల యేండ్ల మనిన వెలుగు బాలబాలికలకు తొడుగు
ఆశయాల కొసలు తాక అందరికొక జయపతాక "జ"



Wednesday, November 18, 2009

oka teeyani vanTakam

నా పోస్ట్ కి మొదటి విమర్శకుడు నా పుత్ర రత్నమే.....నా రచనలకి గుబాళింపు లేదట!
ఇవాళ ఒక తీయని వంటకంతో వాడికి జవాబు ఇవ్వదల్చుకున్నా!మా చిన్ను,సాయి,సుథా ఒన్స్ మోర్ ఒన్స్ మోర్ అనేవాళ్ళు! ఇప్పుడు చిన్ను ఇక్కడ లేకపోయినా, యు.ఎస్ లో ఉన్నా ఇప్పుడు దీని గురించి గుర్తు చేస్తే "ఆహా ఏమి రుచి" అంటుంది!!!
మరి మీకూ తెల్సుకోవాలని ఉందా ఆ మధుర రహస్యమేంటో???????!!!!!!!!!
ఇది నా విజయవంతమైన ప్రయోగం తెల్సా!


కావలసిన పదార్థాలు:
చిక్కటిపాలు(తాజావి)-2 లీ
పంచదార-రుచికి తగినంత(8 టే స్పూ)
బాదాం,జీడిపప్పు,పిస్తా విడివిడిగా -గుప్పెడు
యాలుకలు-2
పచ్చకర్పూరం-చాలకొద్దిగా



తయారీవిధానం:
పిస్తా,బాదాం పప్పులు గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టి పొట్టు తీయాలి.సగం పప్పులను సన్నగా కట్ చేసుకోవాలి.జీడిపప్పును కూడా సగం ముక్కలు చేసుకోవాలి.మిగిలిన సగం పప్పులని పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి.
ఒక మందపాటి గిన్నెలో పాలని పోసి సగం అయ్యేవరకు అడుగంటకుండా కలుపుతూ సన్నటి సెగన కాచాలి.ఆ తరువాత పేస్ట్ చేసి ఉంచుకున్న పప్పులని పాలల్లో కలపాలి,దీనికి పంచదార కూడా కలపాలి.తరువాత 10-15 నిమిషాలు జాగ్రత్తగా మరగనివ్వాలి .చివరిలో మిగిలిన పప్పులని కూడా జత చేసి పూర్తిగా చల్లారనిచ్చి ఫ్రిడ్జ్ లో ఉంచి సర్వ్ చేసుకోవాలి.
ఇది 6-8 మందికి సరిపోతుంది.
ప్రయత్నించండి,తక్కువ శ్రమతో ఎక్కువ మార్కులు కొట్టేసే వంటకం సుమా!!!!

Tuesday, November 17, 2009

తీయనైన తెలుగు పాట నేర్చుకుందాం!!!!

ఈ మధ్య మన తెలుగు భాష  పై  జరిగిన  రభసని గమనించాం కదా ! ఆ నేపథ్యంలో మనమంతా తెలుగులో గేయాలని ఆలపించాలని నిర్ణయించారు కదా !మరి ఈ రోజు నాకు  2 గేయాలు పరిచయం చేయాలనీ ఉంది! తెలిస్తే పాడేసుకోండి తెలియకపోతే నేర్చుకోండి !ఇవి నేను సేకరించినవి మాత్రమే సుమా!

1) జోహారులే తల్లి జోహారులే నీకు
    మము గన్న మా తల్లి మా తెలుగు తల్లివే  ||2||
    రాయలేలిన నాడు రతనాల తూగేవు!!
    రాజరాజులు నాడు రాజ్యాలనేలేవు ||జోహారులే||
    గంటమొక చేతిలో ఖడ్గమొక  చేతిలో 
    విలసిల్లు మా తల్లి వీర మాతవే తల్లి  ||జోహారులే||
    దశ దిశల నీ యశము దీప్తించనే తల్లి
    మా పూజలందుకో మా భాగ్య దేవత ||జోహారులే||
 
మరొక చిన్ని గేయం మీ కోసం
2) తెలుగు బాలలం మేము వెలుగు బాలలం
    తెలుగు వెలుగు దశ దిశల నింపి వేసెదం
    పూల బాలలం మేము పాల బాలలం
    సుకుమారం మాధుర్యం చిందు బాలలం
    తెలుగు బాలలం మేము వెలుగు బాలలం
    తెలుగు వెలుగు దశ దిశల నింపి వేసెదం
    ఆటలాడెదం మేము పాట పాడెదం
    ఆటలలో పాటలలొ పోటీ పడెదము
    తెలుగు బాలలం మేము వెలుగు బాలలం
    తెలుగు వెలుగు దశ దిశల నింపి వేసెదం

మరి ముగించే ముందర ఒక చిన్ని ఝలక్

గాలి  పిల్ల ఎచటికి ?
పూల వాసనొద్దకు !
పూల వాసనెందుకు?
బాలలకిడునందుకు!
                                   బాలబంధు:బి.వి.నరసింహా రావు.

Wednesday, November 11, 2009

chinnakavitha

నీ ఊహలు నా గుప్పిట జాజిమల్లెలు
నీ తలపులు నా ముంగిట నందివర్ధనాలు
నీకై నేను నిరీక్షించే క్షణాలు నిరంతరం గుబాళించే పున్నాగలు
నీ రాక తొలకరి ఏరువాక
ఆ మందారాలు తొలకరి చినుకుకై వేచి చూసే మయూరంలా ...........
నేను

prayer

నేను నా బ్లాగ్ ను ఒక చిన్న ప్రార్ధనా గీతం తో ఆరంభిస్తానే !

వాణీం భజరె వాణీం
గైర్వాణీం భజరె వాణీం
శుక పిక మధుర నినాదం
మోహన మురళీ నాదం
విస్మారమతీయం వాణీం
వాణీం భజరె వాణీం
గైర్వాణీం భజరె వాణీం
వేద వాద వాణీయం
వాల్మీకి మథుర వాణీయం
వ్యాస భాస వాణీయం
కవి కాళిదాస వాణీయం
వాణీం భజరె వాణీం
గైర్వాణీం భజరె వాణీం
మూలం:ఆమళ్ళదిన్నె రమణప్రసాద్